bandla Ganesh: చానాళ్ల తరువాత మళ్లీ మేకప్ వేసుకోబోతున్న బండ్ల గణేశ్!

  • నటుడి నుంచి బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల
  • గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు
  • ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి

  కమేడియన్ గా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేశ్, ఆపై బడా నిర్మాతగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఆపై ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన బండ్ల గణేశ్, తిరిగి నటనవైపు అడుగులు వేశారు. ఓ స్టార్ హీరో సినిమాలో గణేశ్ కీలకమైన పాత్రను పోషించనున్నారని తెలుస్తోంది. ఇక గణేశ్ ఈ సినిమాకు మాత్రమే పరిమితమా? లేక వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళతారా? అన్నది తెలియాల్సి వుంది.  

More Telugu News