అటు కన్నడ రాజకీయ క్రీడ.. ఇటు యడ్యూరప్ప క్రికెట్ క్రీడ!

16-07-2019 Tue 21:48
  • బెంగళూరులోని ఓ హోటల్ ప్రాంగణంలో క్రికెట్
  • బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆట ఆడిన యడ్డీ
  • సామాజిక మాధ్యమాలకు చేరిన ఫొటో
కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి త్వరలో తెరపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 18న కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోనుంది. ఈ తరుణంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. బెంగళూరులోని రమాదా హోటల్ ప్రాంగణంలో తమ ఎమ్మెల్యేలతో కలిసి క్రికెట్ ఆడటం గమనార్హం. యడ్యూరప్ప క్రికెట్ బ్యాట్ పట్టి ఆడుతున్న ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరింది.