Nara Lokesh: మీరు చేసిన నీతిమాలిన పనే మేం చేశామని అనుమానిస్తే పరిశ్రమలు ఎలా వస్తాయి జగన్ గారూ!: నారా లోకేశ్

  • 15 ఏళ్ల క్రితం క్విడ్ ప్రో కో పేరిట కంపెనీలను వేధించారన్న లోకేశ్
  • పెట్టుబడిదారులపైనే ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపాటు
  • జగన్, సాఫ్ట్ బ్యాంక్ లను ట్యాగ్ చేసిన టీడీపీ యువనేత

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేశ్ మరోసారి సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 15 ఏళ్ల క్రితం ఏపీలో పరిశ్రమ పెట్టాలని భావించిన ప్రతి సంస్థనూ వేధించి క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని, ఆనాడు తాము చేసిన నీతిమాలిన పనిని ఈ ఐదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం కూడా చేసిందని వైసీపీ అనుమానిస్తోందని లోకేశ్ మండిపడ్డారు. అంతేకాకుండా, టీడీపీ ప్రభుత్వంపై అనుమానంతో పెట్టుబడిదారులపైనా ఆరోపణలు చేస్తున్నారని, ఇలా చేస్తే పరిశ్రమలు ఎలా వస్తాయి జగన్ గారూ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన టీవీ క్లిప్పింగ్ ను జతపరిచిన లోకేశ్ తన ట్వీట్ కు సీఎం జగన్ తో పాటు సాఫ్ట్ బ్యాంక్ ను ట్యాగ్ చేశారు. పవన, సౌర విద్యుత్తుకు సంబంధించి ఏపీలో సాఫ్ట్ బ్యాంక్ ఎనర్జీ సంస్థ పెట్టుబడులు తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.

More Telugu News