Bihar: తినడానికి ఏమీ దొరక్క ఎలుకలను చంపి తింటున్న బీహార్ వరద బాధితులు!

  • భారీ వర్షాలతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం
  • నీట మునిగిన బీహార్ లోని పలు ప్రాంతాలు
  • ప్రభుత్వ సాయం అందక వరద బాధితుల కష్టాలు

ఈశాన్య రాష్ట్రాలను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలకు నదులు పొంగిపొర్లుతుండడంతో వరదలు సంభవిస్తున్నాయి. బీహార్ లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వరదలకు జనజీవనం అస్తవ్యస్తం కావడంతో ప్రజలు తినడానికి తిండి కూడా లేక అల్లాడిపోతున్నారు. కథీరా ప్రాంతంలో పరిస్థితి చూస్తే వారి కష్టాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. తమ నివాసాలు నీట మునగడంతో రహదారి వెంట గుడారాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అరకొరగా ఉండడంతో, ఇక్కడివారు ఎలుకలను చంపి కాల్చుకుని తింటూ ఆకలి బాధ తీర్చుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలు వైరల్ కావడంతో బీహార్ విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఇది ప్రభుత్వ వైఫల్యమేనంటూ విమర్శల దాడి చేశాయి.

More Telugu News