Mumbai: ముంబయిలో విషాదం: బిల్డర్ నిర్లక్ష్యంతో వదిలేసిన భవనం నేలమట్టం... 12 మంది దుర్మరణం

  • వర్షాల కారణంగా కుప్పకూలిన 80 ఏళ్ల నాటి భవంతి  
  • శిథిలాల కింద మరో 30 మంది
  • సహాయచర్యలు కొనసాగిస్తున్న అధికారులు

కుండపోత వర్షాలతో అతలాకుతలమైన ముంబయి మహానగరంలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఈ నాలుగంతస్తుల భవనం శిథిలాల కింద మరో 30 మంది చిక్కుకుపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ భవనం దాదాపు 8 దశాబ్దాల నాటిది. గత ఏడేళ్లుగా ఈ భవనం ఓ ప్రయివేటు బిల్డర్ చేతిలో ఉంది. డోంగ్రీ ప్రాంతంలోని తండేల్ వీధిలో ఉండే ఈ పురాతన భవంతిని స్థానికులు కేసరీభాయ్ బిల్డింగ్ గా పిలుస్తారు. అయితే, ఈ భవనాన్ని బిల్డర్ కొన్నేళ్ల కిందటే కూల్చివేయాల్సి ఉన్నా, నిర్లక్ష్యంతో వదిలేశాడు. దాని పర్యవసానమే భారీ వర్షాలకు నానిపోయి కుప్పకూలిపోయింది. ఇప్పటివరకు సహాయచర్యల్లో ఐదుగురిని మాత్రమే రక్షించగలిగారు.

More Telugu News