Chandrababu: 45 రోజులు కూడా కాకముందే విషం చిమ్ముతున్నారు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

  • మీ దుర్మార్గాలను అడ్డుకునేందుకే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారు
  • పీపీఏలపై సమీక్ష చేస్తామంటే ఎందుకు వణికిపోతున్నారు?
  • రాష్ట్రానికి రూ. 100 కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సోలార్, పవన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం పున:సమీక్ష చేస్తానంటే మీరెందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. కమిషన్లను మింగి చేసుకున్న పీపీఏల వల్ల ప్రజాధనం ఏటా రూ. 2,500 కోట్లు వృథా అయిందని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చి 45 రోజులు కూడా కాకముందే విషం చిమ్మే ప్రయత్నం మొదలు పెట్టారని మండిపడ్డారు. తమరి దుర్మార్గాలను అడ్డుకునేందుకే ప్రజలు తమరిని ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. అమరావతికి జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని శోకాలు పెడుతున్నారని... ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆయనకు బాగా తెలుసని చెప్పారు.

పెట్టుబడుల పేరుతో చంద్రబాబు 38 దేశాలు తిరిగొచ్చారని... దీని కోసం రూ. 38 కోట్ల ప్రజాధనం ఖర్చయిందని విజయసాయి విమర్శించారు. ఏం తీసుకొచ్చారని అడిగితే.... రూ. 16 లక్షల కోట్లకు ఒప్పందాలు చేసుకొచ్చారంట అంటూ ఎద్దేవా చేశారు. వాస్తవానికి రాష్ట్రానికి రూ. 100 కోట్లు కూడా రాలేదని చెప్పారు. 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ఇప్పటికీ అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు.

More Telugu News