Ram: 'ఇస్మార్ట్ శంకర్'లా ఉంటే హానికరం: హీరో రామ్

  • సెన్సార్ బోర్టు నుంచి ఏ సర్టిఫికెట్
  • నిజ జీవితంలో 'ఇస్మార్ట్ శంకర్'లా ఉండవద్దు
  • ట్విట్టర్ లో రామ్ పోతినేని

 రామ్ హీరోగా, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నిర్మితమైన 'ఇస్మార్ట్ శంకర్' మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధం కాగా, ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ 'ఏ' సర్టిఫికేట్‌ ను జారీ చేసింది. సినిమాలో చిన్నారులు చూసేందుకు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో తెలిపిన రామ్, "పొగతాగడం, మద్యం సేవించడంతో పాటు 'ఇస్మార్ట్ శంకర్‌'లా నిజజీవితంలో వ్యవహరించటం ఆరోగ్యానికి హానికరం. 'ఇస్మార్ట్ శంకర్‌' ఓ కల్పిత పాత్ర అనే తెలుసుకునేలా 'ఇస్మార్ట్‌'గా వ్యవహరించండి" అని తెలిపాడు. కాగా, గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'దేశముదురు', 'పోకిరి', 'బిజినెస్‌ మేన్‌' చిత్రాలు ఏ సర్టిఫికెట్ తో విడుదలై సూపర్‌ హిట్‌ కొట్టాయన్న సంగతి తెలిసిందే.

More Telugu News