Telangana: గ్యాంగ్‌స్టర్ నయీం తల్లి తాహెరాబేగం అరెస్ట్

  • తాహెరాపై 12 కేసులు
  • అబ్దుల్లాపూర్‌మెట్‌లో అదుపులోకి
  • 2016లో పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమైన నయీం

పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం తల్లి తాహెరాబేగంను భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూకబ్జాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, మోసాలతోపాటు పలు నేరాలకు పాల్పడిన తాహెరాబేగంపై 12 కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు భువనగిరి సీఐ సురేందర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరులో తాహెరాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఆయన పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అండర్ వరల్డ్ డాన్‌గా పేరు పొందిన నయీం 2016లో షాద్‌నగర్ పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని  రాజకీయ, ఆర్థిక సెటిల్ మెంట్లు చేస్తూ సమాంతర ప్రభుత్వాన్ని నడిపాడు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన నయిూం ఎట్టకేలకు పోలీసుల చేతిలో హతమయ్యాడు.

More Telugu News