రవితేజ సరసన నాయికగా అదితీరావు

15-07-2019 Mon 11:28
  • 'ఆర్ ఎక్స్ 100'తో హిట్ కొట్టిన అజయ్ భూపతి
  • తదుపరి సినిమాగా 'మహాసముద్రం'
  • త్వరలో రవితేజతో సెట్స్ పైకి
రవితేజ తాజా చిత్రంగా 'డిస్కోరాజా' నిర్మితమవుతోంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత ఆయన అజయ్ భూపతితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అజయ్ భూపతి, తన తదుపరి సినిమాగా 'మహాసముద్రం' రూపొందించనున్నాడు.

ఈ సినిమాలో కథానాయకుడిగా రవితేజను తీసుకున్న ఆయన, తాజాగా నాయిక పాత్ర కోసం అదితీరావును ఎంపిక చేసినట్టుగా సమాచారం. 'సమ్మోహనం' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆమె, ఈ సినిమాతో ఇక్కడ బిజీ అవుతుందేమో చూడాలి. ఇక 'ఆర్ ఎక్స్ 100' తరువాత అజయ్ భూపతి చేస్తోన్న సినిమా కావడంతో, 'మహాసముద్రం' సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.