IPL: లండన్ లో ఐపీఎల్ యాజమాన్యాల ప్రత్యేక సమావేశం... కీలక నిర్ణయం!

  • వచ్చే సీజన్ లో 10 టీమ్ లు
  • చర్చించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు
  • తుది నిర్ణయం బీసీసీఐదే

ఇప్పటికే 12 సీజన్ లను పూర్తి చేసుకున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్), 2020లో 13వ సీజన్ కు రానున్న నేపథ్యంలో, ఈ టోర్నీని మరింత ఆకర్షణీయంగా చేసేందుకు లండన్ లో సమావేశమైన ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలు, మేనేజ్ మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ టోర్నీలో ప్రస్తుతం 8 టీమ్ లుండగా, వచ్చే సీజన్ నాటికి మరో రెండు టీమ్ లను అదనంగా చేర్చి 10 టీమ్ లతో మ్యాచ్ లు నిర్ణయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం.

కాగా, 2011లో కేరళ టస్కర్స్‌, పూణె వారియర్స్‌ పేరిట రెండు ఫ్రాంచైజీలు టోర్నీలోకి అడుగుపెట్టినా, ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఈ రెండు టీమ్ లూ రెండు సీజన్లు మాత్రమే కొనసాగాయన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పొట్టి ఫార్మాట్ కు ఉన్న ఆదరణ దృష్ట్యా, తిరిగి జట్ల సంఖ్యను పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో ఐపీఎల్ మేనేజ్ మెంట్ తో పోలిస్తే, బీసీసీఐదే తుది నిర్ణయం. ఎందుకంటే, జట్ల సంఖ్య పెరిగితే, మరిన్ని మ్యాచ్‌ లు నిర్వహించాలి కాబట్టి.

More Telugu News