England: గెలిచినవాళ్లకీ, ఓడినవాళ్లకీ తేడాలేదు... ఎవరిని కదిలించినా కన్నీళ్లే!

  • ఉత్కంఠపోరులో గెలిచిన ఇంగ్లాండ్
  • పోరాడి ఓడిన న్యూజిలాండ్
  • లార్డ్స్ మైదానంలో రోమాలు నిక్కబొడుచుకునేలా ఫైనల్ మ్యాచ్

కాసేపు అటు మొగ్గితే, మరికాసేపు ఇటు మొగ్గింది! లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తీరిది. అయితే, అదృష్టం కూడా ఉండాల్సిన చోట దురదృష్టం వెంటాడితే అది కివీస్ జట్టవుతుంది! పాపం, చివరి వరకు పోరాడినా, రెండు సార్లు స్కోర్లు సమం చేసినా ఫలితం దక్కలేదు. సూపర్ ఓవర్ లో 16 పరుగులు చేయాల్సిన చోట 15 పరుగులే చేయడంతో కివీస్ గుండె పగిలింది.
అదే సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు గాల్లోకి పంచ్ లు విసురుతూ మైదానంలో పిచ్చిపట్టినట్టుగా పరుగులు తీశారు. స్టోక్స్, బట్లర్ వంటి ఆటగాళ్లు విజయోత్సాహంతో ఆనందబాష్పాలు రాల్చగా, ఓటమిబాధతో మార్టిన్ గప్టిల్, ఇష్ సోధీ వంటి కివీస్ ఆటగాళ్లు కన్నీటిపర్యంతమయ్యారు. ఎప్పుడో నాలుగేళ్లకోసారి వచ్చే ఈవెంట్ కావడంతో వన్డే ప్రపంచకప్ కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఆ విషయాన్ని ఆటగాళ్ల కన్నీళ్లే చెబుతాయి!

More Telugu News