England: పోరాడుతున్న స్టోక్స్, బట్లర్... గెలుపుపై ఇంగ్లాండ్ ఆశలు!

  • వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
  • స్కోరు 37 ఓవర్లలో 4 వికెట్లకు 149 రన్స్
  • 13 ఓవర్లలో 93 పరుగులు చేయాల్సిన వైనం

సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలవాలన్న పట్టుదలతో గత కొన్నేళ్లుగా అద్భుతరీతిలో సన్నద్ధమైన ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ తో  ఫైనల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. వెంటవెంటనే 4 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడిన ఆతిథ్య జట్టును ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, వికెట్ కీపర్ జోస్ బట్లర్ గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరుబోర్డును ముందుకు ఉరికిస్తున్నారు. 37 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటూ 13 ఓవర్లలో 93 పరుగులు చేయాలి. స్టోక్స్ 33, బట్టర్ 31 పరుగులతో ఆడుతున్నారు.

More Telugu News