Telangana: మా కార్యకర్తలపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారు: బీజేపీ నేతల ఆరోపణ

  • సోమారపు సత్యనారాయణతో బీజేపీ ఎంపీలు సంజయ్, అరివింద్ భేటీ
  • బీజేపీలోకి ఆహ్వానించిన వైనం
  • సొంత పార్టీ వ్యక్తులనే ఓడించే స్థాయికి టీఆర్ఎస్ దిగజారింది

తెలంగాణలో తమ కార్యకర్తలపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారని బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఇటీవల టీఆర్ఎస్ ను వీడిన సోమారపు సత్యనారాయణతో వీళ్లిద్దరూ భేటీ అయ్యారు. బీజేపీలో చేరాల్సిందిగా ఆయన్ని ఆహ్వానించారు. సోమారపుతో భేటీ అనంతరం మీడియాతో సంజయ్, అరవింద్ మాట్లాడుతూ, త్వరలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయ పార్టీగా బీజేపీ మారడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సొంత పార్టీ వ్యక్తులనే ఓడించే స్థాయికి టీఆర్ఎస్ దిగజారిందని విమర్శించారు.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సతీష్ జీ, రాం మాధవ్, హరిబాబు, సోము వీర్రాజు, మాధవ్, సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతంపై చర్చించారు. పెదకూరపాడు, మాచర్ల నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. టీడీపీ సభ్యత్వానికి, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన చందు సాంబశివరావు బీజేపీలో చేరారు.

More Telugu News