ISRO: చంద్రయాన్-2 పై అక్కసు వెళ్లగక్కిన న్యూయార్క్ టైమ్స్!

  • ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-2
  • విమర్శనాత్మక కథనం రాసిన అమెరికా మీడియా సంస్థ
  • భారత్ తన సాంకేతిక పరిజ్ఞానం ప్రదర్శించాలనుకుంటోందంటూ వ్యాఖ్యలు

దాదాపు 124 మిలియన్ డాలర్ల ఖర్చుతో చంద్రుడి ఆవలి వైపుకు ఇస్రో సాగిస్తున్న మహాయాత్ర చంద్రయాన్-2. సోమవారం వేకువజామున 2 గంటల 51 నిమిషాలకు జీఎస్ఎల్వీ మార్క్ 3 ఎం1 రాకెట్ చంద్రయాన్-2 ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ భారీ ప్రాజక్టుపై అమెరికా మీడియా వ్యంగ్యం ప్రదర్శిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ఓవైపు అంగారకుడి వైపు పరుగులు పెడుతుంటే, ఇప్పుడందరూ చంద్రుడి పైకి మళ్లీ ఎందుకు వెళ్లాలనుకుంటున్నారంటూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.

అంగారకుడి వద్దకు వెళుతున్న అమెరికాకు చంద్రుడు మార్గమధ్యంలోని ఓ మజిలీ మాత్రమేనని, కానీ భారత్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి చంద్రుడి పైకి యాత్ర చేస్తోందంటూ న్యూయార్క్ టైమ్స్ విమర్శనాత్మక ధోరణిలో పేర్కొంది. అయితే, అమెరికాకు చెందిన సైంటిఫిక్ అనే వెబ్ మీడియా సంస్థ చంద్రయాన్-2 ను చంద్రుడికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నంగా కొనియాడింది. చంద్రుడిపై నీటి జాడలను కనుగొనడంలో చంద్రయాన్-2 ప్రయోగం ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది.

More Telugu News