Bumrah: అచ్చు తనలాగే బౌలింగ్ చేస్తున్న బామ్మ యాక్షన్ పై బుమ్రా స్పందన... వీడియో!

  • వరల్డ్ నంబర్ 1గా ఉన్న బుమ్రా
  • బుమ్రా యాక్షన్ ఇమిటేట్ చేసిన వృద్ధురాలు
  • వైరల్ అవుతున్న వీడియో

కచ్చితమైన లెంగ్త్ తో బౌలింగ్ చేస్తూ, కీలకమైన సమయాల్లో వికెట్లను తీస్తూ, వరల్డ్ నంబర్ వన్ గా ఎదిగిన జస్ ప్రీత్ బుమ్రా, బౌలింగ్ యాక్షన్ ను ఓ వృద్ధురాలు అనుకరించగా, ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అచ్చు బూమ్రాలాగానే పరుగెడుతూ బౌలింగ్ చేసేందుకు ఈ బామ్మ ప్రయత్నించగా, ఆమె కుమార్తె వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అటూ ఇటూ తిరిగి ఇది బుమ్రాకూ చేరింది. "చాలా బావుంది. ఇవాళంతా నవ్వుకుంటూనే ఉన్నా" అంటూ తన ట్విటర్ ఖాతాలో వ్యాఖ్యానించిన బుమ్రా, ఆ వీడియోను షేర్ చేసుకున్నాడు. కాగా, తాజా వరల్డ్‌ కప్‌ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 18 వికెట్లు పడగొట్టాడన్న సంగతి తెలిసిందే.
<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="en" dir="ltr">Just like the rest of us, the mothership was so impressed with Bumrah's performance in the world cup, that she decided to mimic his run-up. ??? <a href="https://t.co/bJYGUqzJvd">pic.twitter.com/bJYGUqzJvd</a></p>— Shanta Sakkubai (@himsini) <a href="https://twitter.com/himsini/status/1149912872887050240?ref_src=twsrc%5Etfw">July 13, 2019</a></blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

More Telugu News