america: ‘ఏరియా 51’పై దండయాత్రకు సిద్ధమైన 5 లక్షల మంది అమెరికన్లు!

  • అమెరికాలో ఏలియన్స్ ఇక్కడే ఉన్నారని పుకార్లు
  • ఇది ఎయిర్ బేస్ మాత్రమేనని చెబుతున్న అమెరికా
  • ఏలియన్స్ ను చూసేందుకు సెప్టెంబర్ 20న ముహూర్తం

అమెరికాలోని నెవేడా ఏడారి ప్రాంతంలో ఉన్న ‘ఏరియా 51’ను ఓ మిస్టరీ ప్రదేశంగా చాలామంది చెబుతారు. ఇది యుద్ధవిమానాల స్థావరం మాత్రమే అని అమెరికా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇక్కడ ఏలియన్స్(గ్రహాంతర జీవులు) ఉన్నాయనీ, తమ రాకపోకలకు ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్నాయని చాలామంది నమ్ముతుంటారు.

ఈ వదంతుల ఆధారంగా పలు హాలీవుడ్ సినిమాలు కూడా తెరకెక్కాయి. ఈ నేపథ్యంలో ‘ఏరియా 51’లో ఉంటున్న ఏలియన్స్ ను కలుసుకోవడానికి అమెరికాలో చాలామంది సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 20న నెవేడాలోని ఏరియా 51కు దూసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం ఫేస్ బుక్ లో ఇప్పటికే 4,96,000 మంది తమ అంగీకారాన్ని తెలిపారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

వీరంతా కలిసికట్టుగా ఏలియన్స్ ను కలుసుకోవడానికి వెళతారని సమాచారం. ఇలా ఒక్కసారిగా భారీ సంఖ్యలో వెళితే ఆర్మీ, వైమానికదళాలు తమను అడ్డుకోలేవని ఈ ఔత్సాహికులు భావిస్తున్నారు. అయితే అప్పటికల్లా ఏలియన్స్ ను అధికారులు మరో రహస్య ప్రాంతానికి తరలించే అవకాశం ఉందనీ, కాబట్టి వెంటనే ఏరియా-51కు వెళ్లాలని మరికొందరు నెటిజన్లు వీరికి సూచిస్తున్నారు.

More Telugu News