Shoiab Akhtar: వరల్డ్ కప్ విజేత ఎవరంటే... షోయబ్ అఖ్తర్ జోస్యం!

  • ఇంగ్లండ్ కే గెలిచే అవకాశాలు అధికం
  • టాస్ గెలిస్తే బ్యాటింగే
  • యూట్యూబ్ లో షోయబ్ వీడియో

పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అఖ్తర్, నేడు ఇంగ్లండ్ - న్యూజిలాండ్ మధ్య జరిగే వరల్డ్ కప్ సెమీఫైనల్ పోరులో ఇంగ్లండ్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. నేడు క్రికెట్ మక్కాగా పేరున్న లార్డ్స్ మైదానంలో ఈ పోరు జరుగనుండగా, షోయబ్ మాట్లాడాడు. యూ ట్యూబ్ లో ఓ వీడియోను పెడుతూ, తాను ఇంగ్లండ్ ను ఎంచుకుంటున్నట్టు తెలిపాడు. ఒకవేళ టాస్ గెలిచిన ఇంగ్లండ్, తొలుత బ్యాటింగ్ తీసుకుంటే విజయావకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని అన్నాడు. జట్టుకు బలమైన పునాది ఇవ్వాల్సిన బాధ్యత మార్టిన్ గుప్టిల్, హెన్రీ నికోలస్ లపైనే ఉందని అన్నారు.

తాను న్యూజిలాండ్ కు కూడా మద్దతిస్తానని, అయితే, ఫైనల్ ఫేవరెట్ మాత్రం ఇంగ్లండేనని అన్నాడు. సొంత గడ్డపై ఆడుతుండటం ఆ జట్టుకు అదనపు బలమని చెప్పాడు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకుంటుందని భావించడంలో సందేహం లేదన్నాడు.

More Telugu News