Elephant: ఆకలితో రెస్టారెంట్ కు వచ్చిన ఏనుగు... ఏమీ దొరక్కపోగా..!

  • కోయంబత్తూరులో ఘటన
  • ఏమీ చేయకుండా వెళ్లిపోయిన ఏనుగు
  • సీసీటివీ కెమెరాల్లో రికార్డు

ఎంత ఆకలితో ఉందో ఏమో... ఓ గజరాజు ఆశగా రెస్టారెంట్ కు వచ్చింది. ఆహార పదార్థాలు ఏమైనా దొరుకుతాయేమోనని ఆశగా చూసింది. ఏమీ దొరకలేదు. ఆ సమయంలో ఏనుగులు ఆగ్రహంతో నానాయాగీ చేసి బీభత్సం చేస్తాయి. కానీ, ఈ ఏనుగు మాత్రం ప్రశాంతంగా వెనుదిరిగింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జరుగగా, ఏనుగు వచ్చి, ఆహారం కోసం వెతికి, నిరాశతో వెనుదిరిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కి వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాంతంలో 50కి పైగా ఏనుగులు సంచరిస్తున్నాయని, అడవుల్లో ఆహారం లభించక జనావాసాల్లోకి నిత్యమూ వస్తున్నాయని రెస్టారెంట్ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News