Balakrishna: బాలకృష్ణ మాజీ పీఏ శేఖర్ కు మూడేళ్ల జైలుశిక్ష!

  • గతంలో బాలయ్య వద్ద పనిచేసిన శేఖర్
  • ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడని నిరూపణ
  • రూ. 3 లక్షల జరిమానా కూడా విధించిన ఏసీబీ కోర్టు

హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్‌ కు నెల్లూరు ఏసీబీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించారన్న ఆరోపణలపై 2008లో శేఖర్‌ పై ఏసీబీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన ఏసీబీ, ఆరోపణలను నిజమేనని తేల్చి, కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆయన పేరిట తిరుపతి, ఎమ్మార్ పల్లి, మదనపల్లి తదితర ప్రాంతాల్లో విలువైన ఆస్తులున్నట్టు తెలిపింది. కేసును విచారించిన కోర్టు, జైలుశిక్ష, జరిమానా విధించింది. కాగా, గతంలో శేఖర్ పై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. హిందూపురం టీడీపీ శ్రేణులు సైతం ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశాయి. విషయం చంద్రబాబు వరకూ వెళ్లడంతో, శేఖర్ ను తన పీఏ పోస్ట్ నుంచి బాలయ్య తొలగించారు. ప్రస్తుతం శేఖర్ అసిస్టెంట్ ఇంజనీర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు.

More Telugu News