Chandrayaan 2: చందమామ దక్షిణ ధృవం పైకి వెళుతున్న మన 'చంద్రయాన్-2'

  • చంద్రుడి దక్షిణ ధృవం వైపు వెళ్లనున్న చంద్రయాన్-2
  • కొత్త విషయాలను కనిపెట్టడానికి కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్న ఇస్రో ఛైర్మన్
  • ఇతరులు వెళ్లని ప్రదేశానికి వెళ్తున్నామంటూ ప్రకటన

చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా భారత్ తన సత్తాను ప్రపంచానికి చాటబోతోంది. ఇంతవరకు ఇతర దేశాలు వెళ్లలేని దక్షిణ ధృవం వైపు అది పయనించనుంది. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లను అక్కడ ల్యాండ్ చేయనుంది.

ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, దక్షిణ ధృవం వైపు మనం వెళ్తున్నామని... ఎందుకంటే అక్కడ ఏముందో ఇంతవరకు ఎవరికీ తెలియదని చెప్పారు. కొత్త ప్రదేశాలను అన్వేషించడం ద్వారానే మనం కొత్త విషయాలను కనిపెట్టగలమని అన్నారు. ఇతరులు వెళ్లని ప్రదేశానికి ఈసారి మనం వెళ్తున్నామని చెప్పారు.

అమెరికాకు చెందిన లూనార్ ల్యాడింగ్స్ అన్నీ చంద్రుడి భూమధ్యరేఖ ప్రాంతంలోనే జరిగాయి. చైనా, రష్యాలు ఉత్తర ధృవం వైపు వాటి రోవర్లను ల్యాండ్ చేశాయి. దక్షిణ ధృవాన్ని తాకబోతున్న తొలి దేశం ఇండియానే కావడం గమనార్హం.

More Telugu News