Chennai: చెన్నై పరిస్థితి దయనీయం... రైళ్ల ద్వారా మంచినీటి తరలింపు

  • రోజుకు 10 మిలియన్ లీటర్ల తరలింపు
  • చెన్నై నగర రోజువారీ కనీస వినియోగం 525 మిలియన్ లీటర్లు
  • భవిష్యత్ లో నీటి లభ్యతపై నిపుణుల ఆందోళన

తమిళనాడు రాజధాని చెన్నైలో నీటి ఎద్దడి మరింత తీవ్రమైంది. నిన్నమొన్నటి దాకా సాధారణ ట్యాంకర్లతో నీటి సరఫరా చేయగా, ఇప్పుడది రైళ్ల ద్వారా తరలించే స్థాయికి చేరింది. ఇందుకోసం ప్రత్యేక రైళ్లను కేటాయిస్తున్నారు. భారీ కెపాసిటీ కలిగిన ట్యాంకర్లతో జాలార్ పేట లోని కావేరీ సహకార తాగునీటి పథకం నుంచి రైలు మార్గం ద్వారా చెన్నై మహానగర దాహార్తి తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నీటి తరలింపు కార్యక్రమం కోసం ప్రతి రోజు రూ.35 లక్షలు ఖర్చు చేస్తున్నారు.

ఈ తీరప్రాంత నగరంలో దినసరి నీటి వినియోగం 525 మిలియన్ లీటర్లు కాగా, ప్రభుత్వం తనవంతుగా 10 మిలియన్ లీటర్లు మాత్రమే సరఫరా చేయగలుగుతోంది. ఇది కనీస నీటి వినియోగంలో రెండు శాతం మాత్రమే. సాధారణ అవసరాల కోసం స్థానికంగా నీటిని అందుబాటులోకి తెచ్చుకుంటున్నప్పటికీ, భవిష్యత్ లో ఈ మాత్రం కూడా నీటి లభ్యత ఉండకపోవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News