Andhra Pradesh: కేన్సర్ ను ముందుగానే గుర్తించాలి.. మా డాక్టర్లు గ్రామాలకు కూడా వెళతారు!: నందమూరి బాలకృష్ణ

  • కేన్సర్ ఎన్నో కారణాల వల్ల వస్తుంది
  • నామమాత్రపు ఫీజుకే చికిత్స అందజేస్తున్నాం
  • బసవతారకం ఆసుపత్రిలో త్రీడీ మమ్మోగ్రఫి యంత్రం ఆవిష్కరణ

కేన్సర్ వ్యాధి అన్నది ఎన్నో కారణాల వల్ల వస్తుందని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ కేన్సర్ ముదిరిపోకముందే గుర్తించాలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణ ఈరోజు ‘త్రీడీ మమ్మోగ్రఫి’ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. బసవతారకం ఆసుపత్రిలో లాభాపేక్ష లేకుండా నామమాత్రపు ఫీజుకు చికిత్స అందజేస్తున్నామని చెప్పారు. బసవతారకం డాక్టర్లు మారుమూల గ్రామాలకు కూడా వెళతారన్నారు.

అత్యాధునిక పరికరాలను సమకూర్చుకుంటూ బసవతారకం ఆసుపత్రిలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. దక్షిణ భారతంలో ఎక్కువ కేన్సర్ పరీక్షలు బసవతారకంలోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బసవతారకం ఆసుపత్రికి చైర్మన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

More Telugu News