Andhra Pradesh: విశాఖ మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్!

  • దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ తనయుడు శ్రీనివాస్  
  • ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన ద్రోణంరాజు
  • గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ప్రభుత్వ విప్ బాధ్యతల నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ ను విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ తనయుడైన శ్రీనివాస్ ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి 1984లో బీకాం పట్టా పొందారు.

1997లో బెర్హమ్ పూర్ విశ్వవిద్యాలయం నుంచి  బ్యాచిలర్ ఆఫ్ లా(ఎల్ ఎల్ బీ) పట్టా పుచ్చుకున్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున విశాఖపట్నం సౌత్ నుంచి పోటీ చేసి ద్రోణంరాజు టీడీపీ అభ్యర్థి గణేశ్ కుమార్ వాసుపల్లి చేతిలో 3,729 ఓట్లతో ఓడిపోయారు.

More Telugu News