mumbai: పురుషుడి పొట్టలో గర్భసంచి.. ఆడా, మగా? తేల్చేందుకు వైద్య పరీక్షలు!

  • వివాహమై రెండేళ్లయినా కలగని సంతానం
  • గర్భసంచిని గుర్తించి విస్తుపోయిన వైద్యులు
  • విజయవంతంగా తొలగింపు

పెళ్లై రెండేళ్లయినా తనకు సంతానం కలగలేదంటూ ఆసుపత్రికి వెళ్లిన ఓ పురుషుడికి వైద్యులు విస్తుపోయే విషయం చెప్పారు. అతడి శరీరంలో గర్భసంచి ఉందని తెలియడంతో తొలుత వైద్యులు షాకయ్యారు. జీర్ణాశయానికి అతుక్కుని అండాశయాలు ఉన్నట్టు పరీక్షల్లో గుర్తించారు. దీంతో అతడు పురుషుడా? లేక మహిళా? అనే విషయాన్ని తేల్చేందుకు తదుపరి పరీక్షలు నిర్వహించారు. ముంబైలో జరిగిందీ ఘటన.

బాధితుడికి పరీక్షలు నిర్వహించిన ముంబై జేజే ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ గీతే.. అతడు లింగపరంగా పురుషుడేనని తేల్చారు. అనంతరం శస్త్రచికిత్స ద్వారా గర్భసంచిని తొలగించారు. ఆ తర్వాత నిర్వహించిన మరో శస్త్రచికిత్స ద్వారా అతడి వృషణాల్లో అండాశయాలను చొప్పించారు. జేజే ఆసుపత్రికి ఇలాంటి కేసు రావడం ఇదే తొలిసారి కాగా, ప్రపంచవ్యాప్తంగా 200 మంది పురుషుల్లో గర్భసంచి ఉన్న ఘటనలు ఇప్పటి వరకు వెలుగుచూశాయి.

More Telugu News