టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీని హతమార్చిన మావోలు

12-07-2019 Fri 19:30
  • మాట్లాడాలి రమ్మంటూ తీసుకెళ్లిన మావోలు
  • నేడు శవంగా కనిపించిన మాజీ ఎంపీటీసీ
  • ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాల మధ్య మృతదేహం లభ్యం
అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా, మాట్లాడాల్సి ఉంది రమ్మంటూ ఓ మాజీ ఎంపీటీసీని ఈ నెల 8న మావోస్టులు తీసుకెళ్లారు. నేడు ఆయన శవంగా కనిపించడంతో భద్రాద్రి జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. చర్ల మండలం పెదమిడిసీలేరుకు చెందిన టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావుని ఇన్‌ఫార్మర్ నెపంతో మావోలు దారుణంగా హతమార్చారు. అతని మృతదేహం నేడు ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాల మధ్య లభ్యమైంది. మృతదేహం వద్ద ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో లభ్యమైన లేఖలో, శ్రీనివాసరావు తమపై ఆదివాసీ ప్రజా సంఘాల పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించినందునే హత్య చేశామని పేర్కొన్నారు.