Nara Lokesh: సొంత పార్టీ నేతలే గుర్రు పెట్టారంటే.. ప్రజల పరిస్థితేంటో?: బడ్జెట్టుపై నారా లోకేశ్ వ్యంగ్యం

  • ఆసక్తికర వీడియోను షేర్ చేసిన లోకేశ్
  • వీడియోపై నెటిజన్ల నుంచి కామెంట్ల వెల్లువ
  • ప్రభుత్వ కోతలకు, కేటాయించిన నిధులకు పొంతన లేదు

నేడు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. వైసీపీ నేతలు  జనరంజక బడ్జెట్  అంటుంటే, టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి నారా లోకేశ్ ఓ ఆసక్తికర వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా వెనుక ఉన్న శ్రీకాంత్ రెడ్డి కునుకు తీస్తున్నారు.

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ‘‘తమ ప్రభుత్వం కోసిన కోతలకు, బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు పొంతన లేదన్న విషయం పక్కనే ఉన్న గౌరవ వైసీపీ సభ్యులకు ముందే తెలిసినట్టుంది. సొంత పార్టీ నేతలే గుర్రుపెట్టారంటే వైఎస్ జగన్ గారి హామీలన్నీ గుర్తుంచుకుని, బడ్జెట్ విన్న ప్రజల పరిస్థితి ఏంటో?’’ అని ఎద్దేవా చేస్తూ లోకేశ్ ట్వీట్ చేశారు.
<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="te" dir="ltr">తమ ప్రభుత్వం కోసిన కోతలకు, బడ్జెట్ లో కేటాయించిన నిధులకు పొంతన లేదన్న విషయం పక్కనే ఉన్న గౌరవ వైసీపీ సభ్యులకు ముందే తెలిసినట్టుంది. సొంత పార్టీ నేతలే గుర్రుపెట్టారంటే <a href="https://twitter.com/ysjagan?ref_src=twsrc%5Etfw">@ysjagan</a> గారి హామీలన్నీ గుర్తుంచుకుని, బడ్జెట్ విన్న ప్రజల పరిస్థితి ఏంటో? <a href="https://t.co/hLJgjR8bRs">pic.twitter.com/hLJgjR8bRs</a></p>— Lokesh Nara (@naralokesh) <a href="https://twitter.com/naralokesh/status/1149639903853985792?ref_src=twsrc%5Etfw">July 12, 2019</a></blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>




More Telugu News