Buggana Rajendranath Reddy: అమ్మఒడి, విద్యాదీవెన పథకాలకు జగన్ పేరు పెట్టడానికి కారణం ఇదే!: బుగ్గన

  • అమ్మఒడి పథకాన్ని జగన్ రూపొందించారు
  • అమ్మఒడి కింద తల్లికి రూ.15 వేలు అందజేత
  • విద్యార్థుల ఖర్చుల కోసం రూపొందించిన పథకం విద్యాదీవెన

నేడు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. రెండు పథకాలకు ముఖ్యమంత్రి జగన్ పేరును పెట్టినట్టు మంత్రి తెలిపారు. వాటిలో ఒకటి 'జగనన్న విద్యా దీవెన' పథకం కాగా, మరొకటి 'జగనన్న అమ్మఒఢి'. ఈ రెండు పథకాలకు జగన్ పేరును పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని నేడు బుగ్గన వివరించారు.

అమ్మఒడి పథకాన్ని జగన్ రూపకల్పన చేశారని, ఈ పథకం ప్రకారం తమ పిల్లలను బడికి పంపే తల్లికి ప్రభుత్వం రూ.15వేలు అందించనుందని తెలిపారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.6,445 కోట్లను కేటాయించారు. జగన్ రూపకల్పన చేసిన పథకం కాబట్టి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించామని, రెండుమూడు సార్లు అడిగినా ఆయన నిరాకరించారని, చివరికి కారణాన్ని చెప్పి ఆయనను ఒప్పించామని బుగ్గన తెలిపారు. దీంతో పాటు విద్యాదీవెన పథకానికి కూడా జగన్ పేరునే పెట్టారు. ఈ పథకం కింద విద్యార్థులకు కావల్సిన పుస్తకాలు, హాస్టల్, ఆహారం తదితర ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.20 వేలను అందించనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.4,962 కోట్లను కేటాయించింది.  

More Telugu News