Ram: 'ఇస్మార్ట్ శంకర్' నుంచి ట్రైలర్ రిలీజ్

  • పూరి నుంచి 'ఇస్మార్ట్ శంకర్'
  • రామ్ సరసన ఇద్దరు నాయికలు
  •  ఈ నెల 18వ తేదీన విడుదల     

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ రూపొందింది. నిధి అగర్వాల్ .. నభా నటేశ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇటు నిధి అగర్వాల్ .. అటు నభా నటేశ్ కాంబినేషన్లోని రామ్ రొమాంటిక్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. రామ్ మేనరిజాన్ని .. తెలంగాణ యాసలో ఆయన డైలాగ్ డెలివరీని ఈ ట్రైలర్లో ఆవిష్కరించారు. మాస్ ఆడియన్స్ ను అలరించాలనే ఉద్దేశంతో, వాళ్లను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా చేశారు. చాక్లెట్ బాయ్ గానే ఎక్కువ మార్కులు కొట్టేసిన రామ్, మాస్ హీరోగా ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి.

More Telugu News