Telangana: ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై తదుపరి విచారణ సోమవారానికి వాయిదా

  • భవనాల కూల్చివేతకు పూనుకున్న ప్రభుత్వం
  • భవనాల కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్
  • నేడు హైకోర్టులో సుదీర్ఘ వాదనలు

తెలంగాణ ప్రభుత్వం నూతన అసెంబ్లీ, సచివాలయ నూతన భవనాల నిర్మాణాలు, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతకు పూనుకున్న విషయం తెలిసిందే. దీంతో భవనాల కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై నేడు విచారణ జరిగింది. ఎర్రమంజిల్ భవనం 150 ఏళ్ల క్రితం నిర్మితమైందని, అయితే తెలంగాణ ప్రభుత్వం 2015 పురాతన భవనాల జాబితా నుంచి దానిని కావాలనే తొలగించిందని పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదించారు. సుదీర్ఘ వాదనల అనంతరం దీనిపై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

More Telugu News