Andhra Pradesh: ఏపీ వ్యవసాయ బడ్జెట్... ముఖ్యాంశాలు

  • రూ. 28,866 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
  • వైయస్సార్ రైతు భరోసాకు రూ. 8,750 కోట్లు
  • 9 గంటల ఉచిత విద్యుత్తుకు రూ. 4,525 కోట్లు

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు నిన్న గుండెపోటుతో మరణించడంతో... ఆయన స్థానంలో బొత్స బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

బడ్జెట్ లోని అంశాలు ఇవే...

  • మొత్తం బడ్జెట్ - రూ. 28,866.23 కోట్లు
  • రెవెన్యూ వ్యయం - రూ. 27,946 కోట్లు
  • పెట్టుబడి వ్యయం - 919 కోట్లు
  • వైయస్సార్ రైతు భరోసా - రూ. 8,750 కోట్లు
  • వైయస్సార్ ఉచిత పంటల బీమా - రూ. 1,163 కోట్లు
  • రైతు సంక్షేమం, వ్యవసాయ విభాగ అభివృద్ధి - రూ. 12,280 కోట్లు
  • వడ్డీలేని రుణాల కోసం - రూ. 100 కోట్లు
  • వైయస్సార్ రైతు బీమా - రూ. 100 కోట్లు
  • ప్రకృతి వ్యవసాయం - రూ. 91 కోట్లు
  • ధరల స్థిరీకరణ - రూ. 3వేల కోట్లు
  • ఎన్జీ రంగా యూనివర్శిటీకి - రూ. 355 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ - రూ. 460 కోట్లు
  • ఉద్యానవన శాఖ - రూ. 1,532 కోట్లు
  • ఉద్యాన వర్శిటీకి - రూ. 63 కోట్లు
  • పశు నష్టపరిహారం పథకం - రూ. 50 కోట్లు
  • పట్టు పరిశ్రమ - రూ. 158 కోట్లు
  • పశు సంవర్ధక శాఖకు - రూ. 1,240 కోట్లు
  • పాల సేకరణ కేంద్రాలకు  - రూ. 100 కోట్లు
  • కోళ్ల పరిశ్రమ - రూ. 50 కోట్లు
  • 2 పశు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు - రూ. 75 కోట్లు
  • ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి - రూ. 70 కోట్లు
  • ఎస్వీ పశు వైద్య విద్యాలయానికి - రూ. 87 కోట్లు
  • మత్స్యశాఖ అభివృద్ధి - 409 కోట్లు
  • 9 గంటల ఉచిత విద్యుత్ - రూ. 4,525 కోట్లు
  • వ్యవసాయానికి ఉపాధిహామీ అనుసంధానం - రూ. 3,626 కోట్లు
  • వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు - రూ. 100 కోట్లు
  • మార్కెటింగ్ శాఖకు - రూ. 3,012 కోట్లు
  • జాతీయ ఆహార భద్రత మిషన్ కు - రూ. 141 కోట్లు
  • పొలం బడి - రూ. 89 కోట్లు
  • భూసార నిర్వహణ - రూ. 30 కోట్లు
  • వ్యవసాయ మౌలిక వసతులకు - రూ. 349 కోట్లు
  • రైతులకు రాయితీపై విత్తనాలకు - రూ. 200 కోట్లు
  • ప్రమాదవశాత్తు రైతు మృతి చెందితే రూ. 7 లక్షల పరిహారం
  • రైతులకు 90 శాతం సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు
  • విపత్తు నిర్వహణ నిధికి - రూ. 2,002 కోట్లు

More Telugu News