Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019-20 ముఖ్యాంశాలు!

  • అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన
  • రవాణా వ్యవస్థను ఎకో ఫ్రెండ్లీగా మారుస్తామని ప్రకటన
  • సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు అసెంబ్లీలో 2019-20 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాలను అమలు చేసేందుకు వీలుగా వాటికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ఏపీలో ప్రజారవాణా వ్యవస్థను ఎకో ఫ్రెండ్లీగా మారుస్తామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామనీ, ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఏపీ బడ్జెట్ 2019-20 ముఖ్యాంశాలు ఇవే...

  • ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగానికి రూ.46,858 కోట్ల కేటాయింపు
  • ఏపీలో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రూ.400 కోట్లు
  • మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి రూ.952 కోట్లు
  • మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖకు రూ.6,587 కోట్లు కేటాయింపు
  • అగ్రిగోల్డ్ బాధితులకు సాయం కోసం రూ.1,150 కోట్లు
  • సాగునీరు, వరద నివారణకు రూ.13,139 కోట్లు 
  • వైఎస్సార్ రైతు భరోసా పథకానికి రూ.8,750 కోట్లు
  • రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ కోసం రూ.4,525 కోట్లు
  • రైతుల పంటకు సంబంధించి ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.3,000 కోట్లు
  • ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2,002 కోట్లు కేటాయింపు
  • వైఎస్సార్ రైతు బీమాకు రూ.1,163 కోట్లు
  • అక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసం రూ.475 కోట్లు
  • రైతన్నలకు ఉచిత బోర్లు వేయించేందుకు రూ.200 కోట్లు
  • విత్తనాల పంపిణీకి మరో రూ.200 కోట్లు కేటాయింపు
  • ఏపీలో వృద్ధులు, వితంతువుల పెన్షన్ల కోసం రూ.12,801 కోట్లు కేటాయింపు

More Telugu News