బాధ పెడుతున్న ఓటమి... ఇప్పుడు మరో కొత్త ఇబ్బంది!

12-07-2019 Fri 11:49
  • స్వదేశానికి రావడానికి దొరకని టికెట్లు
  • ఆదివారం వరకు ఇంగ్లండ్ లోనే
  • టికెట్లను సర్దుబాటు చేస్తున్నామన్న బీసీసీఐ

ప్రపంచకప్ సమరం నుంచి ఊహించని విధంగా టీమిండియా నిష్క్రమించింది. ఓటమితో పూర్తిగా డీలా పడిపోయిన భారత ఆటగాళ్లు ఇప్పుడు మరో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ స్వదేశానికి తిరిగిరావడానికి టికెట్లను సర్దుబాటు చేయడంలో బీసీసీఐ విఫలమైంది. దీంతో, వారంతా మాంచెస్టర్ లోనే గడుపుతున్నారు. ఆదివారం వరకు వారు అక్కడే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. టికెట్ల కోసం బీసీసీఐ ప్రయత్నించినప్పటికీ... టికెట్లు దొరకలేదు.
ఈ సందర్భంగా బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ, టికెట్లు సర్దుబాటు చేస్తున్నామని తెలిపారు. కొందరు మాత్రమే భారత్ కు తిరిగి వస్తారని... మిగిలిన వారు రెండు బృందాలుగా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్తారని చెప్పారు. వారికి కూడా టికెట్లను సర్దుబాటు చేస్తున్నామని తెలిపారు.