ముఖ్యమంత్రి జగన్ ను కలసిన వల్లభనేని వంశీ

- గోదావరి జలాల్ని తరలించేందుకు సహకరించండి
- సొంత ఖర్చుతో నీళ్లు అందిస్తున్నానని వెల్లడి
- ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను అందించింది
నేడు ఆయన భేటీ అయి గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట గ్రామాలకు పోలవరం కుడికాల్వ నుంచి గోదావరి జలాల్ని తరలించేందుకు సహకరించాలని కోరారు. తన సొంత ఖర్చుతో 500 మోటార్లు ఏర్పాటు చేసి గత నాలుగేళ్లుగా నీళ్లు అందిస్తున్నానని, దీనికోసం ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను అందిస్తూ వచ్చిందని వెల్లడించారు. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులకు ఆదేశాలిచ్చి గతంలో మాదిరిగానే విద్యుత్ సరఫరా ఇచ్చేలా చూడాలని వంశీ విజ్ఞప్తి చేశారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందించారు.