టిక్‌టాక్ చేసేందుకు చెరువులోకి దిగి యువకుడి మృతి
- బంధువుల ఇంటికి వెళ్లిన నరసింహ
- ప్రశాంత్ వీడియో తీస్తుంటే టిక్‌టాక్ చేసిన నరసింహ
- చెరువులో కుంట ఉండటంతో జారిపడిపోయి మృతి
తన బంధువైన ప్రశాంత్ వీడియో తీస్తుండగా నరసింహ చెరువులోకి దిగి పాటలు రికార్డ్ చేశాడు. ఇంకా పర్ఫెక్షన్ కోసం మరోసారి ప్రయత్నిస్తానని నరసింహ చెరువులో మరింత లోతుకు వెళ్లాడు. అయితే అక్కడ కుంట ఉండటంతో దానిలోకి జారిపోయాడు. ప్రశాంత్ చుట్టుపక్కల వారికి సమాచారమిచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. కుంట లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలోకి దిగేందుకు ఎవరూ సాహసించలేదు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా, గజ ఈతగాళ్ల సాయంతో నరసింహ మృతదేహాన్ని వెలికి తీశారు.