Kumaraswamy: కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్... నేను రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందన్న కుమారస్వామి

  • సస్పెన్స్ సినిమాను తలపిస్తున్న కర్ణాటక రాజకీయం
  • కుమారస్వామి రాజీనామా చేస్తారంటూ ఉదయం నుంచి వార్తలు
  • అంత అవసరం ఏమొచ్చిందని మీడియాను ప్రశ్నించిన స్వామి

కర్ణాటకలో మారుతున్న రాజకీయ పరిణామాలు సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేస్తారనే వార్తలు ఉదయం చక్కర్లు కొట్టాయి. ఇంతలోనే సీన్ మారిపోయింది. ఇప్పటికిప్పుడు తాను రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కుమారస్వామి ప్రశ్నించారు. మీరు రాజీనామా చేయబోతున్నారనే సమాచారం అందుతోందంటూ మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ మేరకు స్పందించారు.

2009-10లో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అతన్ని వ్యతిరేకిస్తూ ఎనిమిది మంది మంత్రులు సహా 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని... కానీ అప్పుడు ఏం జరిగింది? అని ప్రశ్నిస్తూ మీడియా నుంచి కుమారస్వామి దూరంగా వెళ్లిపోయారు. మరోవైపు ఈ సాయంత్రం 6 గంటల లోపు స్పీకర్ ముందు హాజరుకావాలంటూ రెబెల్ ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజీనామా చేయాలనుకున్న వారు నేరుగా స్పీకర్ కు రాజీనామా పత్రాలను అందజేయాలని సూచించింది.

More Telugu News