Australia: వరల్డ్ కప్ సెమీఫైనల్: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

  • బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్ సారథి
  • బర్మింగ్ హామ్ వేదికగా మ్యాచ్
  • ఇప్పటికే  ఫైనల్ చేరిన న్యూజిలాండ్

ఆతిథ్య ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బర్మింగ్ హామ్ లో మరికాసేపట్లో వరల్డ్ కప్ సెమీఫైనల్ ప్రారంభం కానుంది. ఈ పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టులో పెద్ద మార్పులేవీ లేవు. ఆసీస్ జట్టు మాత్రం గాయపడిన ఉస్మాన్ ఖవాజా స్థానంలో హ్యాండ్స్ కోంబ్ ను తుదిజట్టులోకి తీసుకుంది. సొంతగడ్డపై జరుగుతున్నందున ఇంగ్లీష్ జట్టు ఈ మ్యాచ్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇంగ్లాండ్ ఫామ్ లో ఉన్న తీరు కూడా ఆ జట్టుపై భారీ అంచనాలు కలిగిస్తోంది. ఇక మేజర్ టోర్నమెంట్లలో ఆస్ట్రేలియా ఆటతీరు ఓ మెట్టు పైకి చేరుతుంది. కీలకమైన మ్యాచ్ లలో  చిన్న అవకాశం దొరికినా చాలు, ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి ఉక్కిరిబిక్కిరి చేయడంలో ఆసీస్ దిట్ట.

More Telugu News