Telangana: బుల్లెట్ రైళ్లు, హైస్పీడ్ రైళ్లకు దక్షిణ భారతం అనర్హమైనదిగా భావిస్తున్నారేమో!: కేటీఆర్

  • కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కేటీఆర్
  • తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులో మొండిచేయిపై ఆగ్రహం
  • బడ్జెట్ కేటాయింపుల్లో ఈసారి ‘నో’ అనే కనిపిస్తుందని వ్యాఖ్య

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రైల్వే ప్రాజెక్టును కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొత్తగా రైల్వే సర్వీసులు లేవు. కొత్త రైల్వే లైను లేదు. కొత్త మార్గాల కోసం సర్వే కూడా నిర్వహించలేదు.

ఇక బుల్లెట్ రైలు, హైస్పీడ్ రైళ్ల ఊసే లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్ పెంపు లేదు. బడ్జెట్ కేటాయింపుల్లో ఈసారి తెలంగాణకు నో(లేదు) అనేదే కనిపిస్తోంది. చూస్తుంటే బుల్లెట్ రైలు, హైస్పీడ్ రైళ్ల  ప్రాజెక్టులకు దక్షిణ భారతం అనర్హమైనదిగా భావిస్తున్నారేమో’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

More Telugu News