brahmaputra: ప్రమాద స్థాయిని దాటిన బ్రహ్మపుత్ర... 62వేల మంది తరలింపు

  • ఉగ్రరూపం దాల్చిన బ్రహ్మపుత్ర
  • వరద ముంపుకు గురైన పలు జిల్లాలు
  • గౌహతిలో విరిగిపడ్డ కొండచరియలు

భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది. అసోంలోని జోర్హట్ వద్ద నీటి మట్టం డేంజర్ మార్క్ ను దాటింది. ఈ నేపథ్యంలో 62వేలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దేమాజీ, లక్ష్మిపూర్, బిశ్వనాథ్, జోర్హట్, గోలాఘాట్ జిల్లాలు వరద ముంపుకు గురయ్యాయి. భారీ వర్షాల కారణంగా గౌహతిలో కొండచరియలు విరగిపడ్డాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

వరదల కారణంగా గత ఏడాది రాష్ట్రంలో దాదాపు 11 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే జన జీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలు ఆగకుండా కురుస్తుండటంతో... పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.

More Telugu News