Uber: హెలికాప్టర్ సేవలను ప్రారంభించిన ఉబెర్ కంపెనీ.. కళ్లు బైర్లు కమ్మేలా చార్జీలు!

  • అమెరికాలోని న్యూయార్క్ లో సేవలు ప్రారంభం
  • ప్లాటినం, డైమండ్ కస్టమర్లకే పరిమితం చేసిన కంపెనీ
  • ప్రస్తుతం రోజుకు 8-10 సర్వీసులే నడపాలని నిర్ణయం

ప్రముఖ కార్ల అగ్రిగేటర్ సంస్థ ఉబెర్ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకూ రోడ్డు మార్గంలో సేవలు అందించిన ఉబెర్ సంస్థ తాజాగా ‘ఉబెర్ ఎయిర్’ పేరుతో హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న మాన్ హట్టన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి జాన్ ఎఫ్.కెన్నడి ఎయిర్ పోర్టు వరకూ ఈ సేవలను ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ఈ సేవలను ఉబెర్ డైమండ్, ప్లాటినం కస్టమర్లకు మాత్రమే పరిమితం చేశామని వెల్లడించారు.

ఇందుకోసం న్యూజెర్సీకి చెందిన ‘హెలీఫ్లైట్’ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. తాము రోజుకు 8 నుంచి 10 సర్వీసులను ప్రస్తుతం నడపాలని నిర్ణయం తీసుకున్నామనీ, 8 నిమిషాల ప్రయాణానికి రూ.15,000 వరకూ వసూలు చేస్తున్నామని చెప్పారు. ఒక్కో హెలికాప్టర్ లో ఐదుగురు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సేవలను భారత్ సహా ఇతర దేశాలకు విస్తరించే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కంపెనీ ప్రతినిధులు అన్నారు.

More Telugu News