America: క్రిస్పర్‌ క్యాస్‌-9తో హెచ్‌ఐవీకి చెక్‌: శాస్త్రవేత్తల ఆవిష్కరణ

  • కొత్త టెక్కాజీతో హెచ్‌ఐవీ మాయం
  • 2014 నుంచి కొనసాగుతున్న ప్రయోగాలు
  • ఎలుకలపై పరిశోధనలు ఫలితమిచ్చాయన్న పరిశోధకులు

ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్‌ మహమ్మారిని విస్తరించే హెచ్‌ఐవీ వైరస్‌కు  క్రిస్పర్‌ క్యాస్‌ –9 టెక్నాలజీతో చెక్‌ చెప్పవచ్చునంటున్నారు అమెరికాలోని టెంపుల్‌, నెబ్రాస్కా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వ్యాధితో బాధపడుతున్న ఎలుకలకు యాంటీ రెట్రో వైరల్‌ మందులను నెమ్మదిగా వారాలపాటు అందిస్తూ హెచ్‌ఐవీ వైరస్‌ను వాటి శరీరంలో పరిమితం చేయగలిగారు.

అనంతరం కణాల లోపల ఉండే వైరస్‌ డీఎన్‌ఏ పోగును కత్తిరించడం ద్వారా వైరస్‌కు పూర్తిగా చెక్‌ చెప్పారు. కొన్నాళ్ల తరువాత పరిశీలన చేయగా వ్యాధికారక ఎలుకల్లో మూడొంతుల వాటిలో హెచ్‌ఐవీ వైరస్‌ కనిపించలేదని ఈ శాస్త్రవేత్తలు ప్రకటించారు. వైద్య శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ హెచ్‌ఐవీకి ఇప్పటి వరకు పూర్తి స్థాయి చికిత్స లేదు. యాంటీ రెట్రో వైరల్‌ మందులు అందించడం ద్వారా రోగి జీవితకాలాన్ని మాత్రం పెంచగుగుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఈ పరిశోధన అత్యద్భుతమేనని భావిస్తున్నారు. 2014లో టెంపుల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మానవ కణాల జన్యువుల్లోంచి వైరస్‌ను తొలగించడంలో విజయం సాధించగా, తర్వాత కాలంలో నెబ్రాస్కా యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో కలిసి బతికున్న జంతువులపై ప్రయోగాలు చేసి విజయం సాధించారు.

More Telugu News