Telugudesam: ఆపరేషన్ కమలం ఎఫెక్ట్.. టీడీపీకి గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్‌ సాంబశివరావు రాజీనామా

  • నాసాలో శాస్త్రవేత్తగా పనిచేసిన సాంబశివరావు
  • టీడీపీలో కలిసిరాని కాలం
  • బీజేపీ కండువా కప్పుకునేందుకు రెడీ

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా చేశారు. అధినేత చంద్రబాబుకు అత్యంత విధేయుడిగా పేరున్న సాంబశివరావు రాజీనామా నేతలకు షాక్‌కు గురిచేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో శాస్త్రవేత్తగా పనిచేసిన సాంబశివరావు 2004లో టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో  గుంటూరు జిల్లా దుగ్గిరాల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.

టీవీ చర్చల్లో టీడీపీ వాణిని బలంగా వినిపించడంలో ముందుండే సాంబశివరావును ఎమ్మెల్సీని చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే, చంద్రబాబు ఆయనకు  రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) డైరెక్టర్ పదవి ఇచ్చారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. చంద్రబాబుకు వీర విధేయుడిగా ఉన్న ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం పార్టీ నేతలను షాక్‌కు గురిచేసింది. త్వరలోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.

More Telugu News