India: బ్రేకింగ్ న్యూస్: టీమిండియా-న్యూజిలాండ్ సెమీఫైనల్ బుధవారానికి వాయిదా

  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
  • న్యూజిలాండ్ స్కోరు 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు  
  • వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్

మాంచెస్టర్ లో వరుణుడు ప్రతాపం చూపించడంతో టీమిండియా, న్యూజిలాండ్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం పలుమార్లు దోబూచులాడడంతో మైదానాన్ని సిద్ధం చేసే పనులకు ఆటంకం ఏర్పడింది. దాంతో మ్యాచ్ ను బుధవారానికి వాయిదా వేశారు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ కప్ లో సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ లకు రిజర్వ్ డేను ఏర్పాటు చేశారు. ఇక, బుధవారం నాడు షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ మొదలవుతుంది. న్యూజిలాండ్ జట్టు 46.1 ఓవర్ల నుంచి బ్యాటింగ్ కొనసాగించాల్సి ఉంటుంది.

మంగళవారం, మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్ (67), టామ్ లాథమ్ (3) ఉన్నారు. కీలకమైన ఈ పోరులో భారత బౌలర్లు అద్భుతమైన క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ చేసి కివీస్ ని భారీస్కోరు చేయనివ్వకుండా కట్టడిచేశారు. ముఖ్యంగా కొత్తబంతితో బుమ్రా, భువనేశ్వర్ నిప్పులు చెరిగే బంతులేయగా, మిడిల్ ఓవర్లలో చాహల్, పాండ్య, జడేజా తమవంతు సహకారం అందించారు. టీమిండియా ఈ మ్యాచ్ కోసం ఐదుగురు బౌలర్లతో బరిలో దిగగా, అందరూ తలో వికెట్ తో కివీస్ ను నిలువరించారు.

More Telugu News