Enforcement Directerate: ఈడీ మాజీ డిప్యూటీ డైరెక్టర్ బొల్లినేని శ్రీనివాస్ గాంధీ నివాసాల్లో సీబీఐ సోదాలు

  • ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపణ 
  • ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్ లోని నివాసాలపై దాడులు
  • రూ.3.75 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్టు గుర్తింపు  

జీఎస్టీ సీనియర్ అధికారి, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేసిన  బొల్లినేని శ్రీనివాస్ గాంధీ నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. బొల్లినేని గాంధీ అక్రమాలకు పాల్పడ్డారని, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్ లోని ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకూ ఆయనకు చెందిన రూ.3.75 కోట్ల అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. బొల్లినేనికి చెందిన ఆయా నివాసాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈడీ, కేంద్ర ఆర్థిక శాఖ, పీఎంవోకు ఆయనపై పలు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. కాగా, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు బొల్లినేని సన్నిహితుడు అని సమాచారం. పదేళ్లకు పైగా ఈడీ శాఖలో ఆయన పనిచేశారు.  

More Telugu News