టీమిండియాకు ప్రధాన అడ్డంకిని తొలగించిన చాహల్... మూడో వికెట్ కోల్పోయిన కివీస్

09-07-2019 Tue 17:45
  • విలియమ్సన్ అవుట్
  • టీమిండియా శిబిరంలో హుషారు
  • న్యూజిలాండ్ స్కోరు 37 ఓవర్లలో 140/3
ఒక్కసారి క్రీజులో పాతుకుపోయాడంటే కొరకరానికొయ్యలా పరిణమించే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (67) ఎట్టకేలకు అవుటయ్యాడు. మాంచెస్టర్ లో జరుగుతున్న సెమీఫైనల్ సమరంలో విలియమ్సన్ వికెట్ ను టీమిండియా లెగ్ స్పిన్నర్ చాహల్ తన ఖాతాలో వేసుకున్నాడు. చాహల్ బ్యాట్స్ మన్ ను ఊరించేలా బంతిని టాస్ చేయగా, ఎంతో ఉత్సాహంగా షాట్ ఆడిన విలియమ్సన్ ఫీల్డర్ జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దాంతో కివీస్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కివీస్ 37 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్ (29) కు జతగా ఆల్ రౌండర్ జిమ్మీ నీషామ్ ఆడుతున్నాడు.