'రాక్షసుడు' విడుదల తేదీ ఖరారు

Tue, Jul 09, 2019, 05:07 PM
  • తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్'
  • తెలుగు రీమేక్ గా 'రాక్షసుడు'
  • వచ్చేనెల 2వ తేదీన విడుదల
బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా 'రాక్షసుడు' నిర్మితమైంది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శ్రీనివాస్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. ఆగస్టు 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ ఒక స్పెషల్ పోస్టర్ వదిలారు.

కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చారు. క్రితం ఏడాది తమిళంలో వచ్చిన 'రాచ్చసన్' సినిమాకి ఇది రీమేక్. విష్ణు విశాల్ - అమలా పాల్ జంటగా నటించిన ఆ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad