Naresh Goel: విదేశాలకు వెళ్లాలంటే రూ. 18వేల కోట్లు డిపాజిట్ చేయండి: 'జెట్ ఎయిర్ వేస్' గోయల్ కు కోర్టు సూచన

  • జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు గోయల్ కు చుక్కెదురు
  • దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి నిరాకరణ
  • లుక్ అవుట్ సర్క్యులర్ పై సమాధానం చెప్పాలని కేంద్రానికి ఆదేశం

జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలన్న ఆయన విన్నపాన్ని తిరస్కరించింది. తన మీద జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ ను సవాల్ చేస్తూ ఆయన చేసిన అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఒకవేళ విదేశాలకు వెళ్లాలనుకుంటే రూ. 18వేల కోట్లను డిపాజిట్ చేసి వెళ్లవచ్చని గోయల్ కు సూచించింది. మే నెల 25న దుబాయ్ కు వెళ్తుండగా విమానం నుంచి గోయల్ ను దించేశారు. విమానం దించేసిన తర్వాతే తనకు తనపై జారీ అయిన లుక్ అవుట్ గురించి తెలిసిందని ఆ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఆయనపై ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.

More Telugu News