Hundai: హ్యుందాయ్ విద్యుత్ కారు 'కోనా'... ఎన్నో ప్రత్యేకతలు!

  • ఏకధాటిగా 557 కిమీ ప్రయాణం
  • 9.7 సెకన్లలో 100 కిమీ పికప్
  • గంటలో 80 శాతం చార్జింగ్

ఇప్పుడంతా హైబ్రిడ్ కార్లపై దృష్టి పెడుతున్నారు. భవిష్యత్ లో డీజిల్, పెట్రోల్ వంటి సంప్రదాయ ఇంధనాలు విరివిగా లభ్యమయ్యే అవకాశాలు తగ్గుముఖం పడతుండడంతోపాటు, ఖర్చు తగ్గించుకునే క్రమంలో భాగంగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు విద్యుత్ తో నడిచే కార్లను రూపొందిస్తున్నాయి. ప్రపంచ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ కూడా కోనా పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. దీన్ని తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు. కోనా విద్యుత్ తో నడిచే ఎస్ యూవీ. భారత్ లో ఎలక్ట్రిసిటీతో నడిచే తొలి ఎస్ యూవీ ఇదే. కంఫర్ట్, ఎకో, స్పోర్ట్ మోడళ్లలో ఇది లభ్యమవుతుంది.

దీని ప్రత్యేకత ఏంటంటే, ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే ఏకధాటిగా 557 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఇది 9.7 సెకన్లలో అందుకుంటుంది. భారత్ లో ఇప్పుడున్న సాధారణ ఎస్ యూవీలతో పోలిస్తే దీని వేగం ఎంతో అధికం అని చెప్పాలి. ఇక దీని బ్యాటరీ విషయానికొస్తే, ఒక్క గంటలో 80 శాతం చార్జింగ్ అయ్యేలా సరికొత్త టెక్నాలజీ పొందుపరిచారు. కోనా ధర విషయానికొస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ను రూ.25.30 లక్షలుగా నిర్ణయించారు.

More Telugu News