India: షమీ లేకుండానే కీలక మ్యాచ్ ఆడుతున్న టీమిండియా... క్రికెట్ పండితుల అసంతృప్తి!

  • మాంచెస్టర్ లో తొలి సెమీఫైనల్
  • టీమిండియా, కివీస్ అమీతుమీ
  • భువనేశ్వర్ పైనే మేనేజ్ మెంట్ నమ్మకం

ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచకప్ లో ఇవాళ టీమిండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నాయి. అయితే ఈ పోరు కోసం టీమిండియా ఐదుగురు బౌలర్లతో రంగంలోకి దిగుతోంది. అంతవరకు బాగానే ఉంది! కానీ, తిరుగులేని ఫామ్ లో ఉన్న మహ్మద్ షమీకి తుదిజట్టులో స్థానం లభించకపోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. భువనేశ్వర్ కుమార్ గాయపడడంతో వరల్డ్ కప్ లో నాలుగు మ్యాచ్ లు ఆడిన షమీ 14 వికెట్లు తీసి బ్యాట్స్ మెన్ వెన్నులో వణుకు పుట్టించాడు.

ఇప్పుడు కీలకమైన సెమీఫైనల్ సమరంలో షమీని పక్కనబెట్టి, గత మ్యాచ్ లో విఫలమైన భువనేశ్వర్ పైనే టీమ్ మేనేజ్ మెంట్ నమ్మకం ఉంచింది. దీనిపై క్రికెట్ మేధావులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ మ్యాచ్ లో షమీని ఆడించాల్సిందని ప్రముఖ వ్యాఖ్యాతలు అభిప్రాయపడుతున్నారు. ఏ విధంగా చూసినా టీమిండియా మేనేజ్ మెంట్ తీసుకున్నది సరైన నిర్ణయం కాదని అంటున్నారు.

More Telugu News