Andhra Pradesh: జనసేనను కాదని కాపు జాతి మొత్తం వైసీపీకి ఓటు వేసింది!: ముద్రగడ పద్మనాభం

  • ఏపీ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాసిన ముద్రగడ
  • కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని వినతి
  • జగన్ తమకు న్యాయం చేస్తారని ఆశాభావం

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశారు. కాపు సామాజికవర్గానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్ పై ఉందని ముద్రగడ తెలిపారు. చంద్రబాబు పూర్తి చేయకుండా వదిలేసిన కాపులకు 5 శాతం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజికవర్గానికి చెందిన పార్టీని(జనసేనను) కూడా కాదని కాపులంతా వైసీపీకి ఓటేశారని ముద్రగడ గుర్తుచేశారు. కాపు జాతికి వైసీపీ న్యాయం చేస్తుందని తాను నమ్ముతున్నట్లు ముద్రగడ తెలిపారు. కాపు సామాజికవర్గానికి సీఎం జగన్ న్యాయం చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News