సీఎం కుమారస్వామి తక్షణం రాజీనామా చేయాలి: యడ్యూరప్ప డిమాండ్

08-07-2019 Mon 18:01
  • కర్ణాటకలో మారుతున్న రాజకీయ పరిణామాలు 
  • కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
  • కుమారస్వామి రాజీనామాను ప్రజలంతా కోరుతున్నారు 
కర్ణాటకలో రాజకీయ పరిణామాలు గంటగంటకూ మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి ముందు బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ, శాసనసభాపక్ష సమావేశంలో తగిన నిర్ణయం తీసుకుంటామని, కాంగ్రెస్, కూటమి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని, సీఎం కుమారస్వామి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కుమారస్వామి రాజీనామాను ప్రజలంతా కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రేపు కర్ణాటక వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు.